Monday 17 February 2014

Telangana will forms today as 29th State of India



దశాభ్దాల కల నెరవేరే వేళ , దశాభ్దాల  బానిస సంకెళ్ళు తెంచుకునే వేళ రానే వొచ్చేసింది.  తెలంగాణ బిల్లు లోక్ సభ లో చర్చ కు ఈరోజే రానుంది.  మధ్యాహ్నం 12 గంటలకు చర్చమొదలు కానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది.  ఇరుప్రాంత ప్రజా ప్రతినిధులు తమ తమ వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు.  అధికార యు.పి.ఏ సర్కారు ప్రతిస్టాత్మకంగా భావించి ఈ బిల్లు ను ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కించే యోచనలో ఉందని తెలుస్తోంది.  అన్నీ అనుకున్నట్లు జరుగుతే ఈరోజే తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.

సీమాంధ్ర పెట్టుబడిదారుల అక్రమాలకూ అడ్డుకట్ట పడనుంది. అభినవ భగత్ సింఘ్, అభినవ అల్లూరి సీతారామరాజు లు గా తమను తాము అభివర్నించుకొని మహనీయుల పరువు దిగజార్చే రాజకీయ నాయకుల అక్రమాలకూ అడ్డుకట్ట పడబోతోంది.  తెలంగాణా సంస్కృతి పై, యాస పై, కట్టు బొట్టు పై, జీవన శైలి పై సీమంధ్ర దురహంకారులు జరిపిన దశాభ్దాల అత్యాచారానికి తెర పడబోతోంది.  తెలుగువారంటే ఆంధ్ర, రాయలసీమ వారే అన్నట్టు, పాట్య పుస్తకాలలో, విగ్రహాల ద్వారా చాటి చెప్పుకుని తెలంగాణా చరిత్రను చరిత్రకారులను మరుగున పడవేసిన సీమాంధ్ర పెత్తనానికి తెరపడబోతోంది. 

సంభరాలు చేసుకోవడానికి రడీ గా ఉండాలని తెలంగాణా ప్రజలకు  ముందుగానే తీపి కబురు చెప్పిన తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేకర రావు గారికి మా 2dayupdates.blogspot.com తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.  అలాగే తెలంగాణ రాష్ట్ర పౌరులకు తెలంగాణా రాష్ట్ర సాకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.  జై హింద్, జై తెలంగాణా. 



ట్యాగ్: tg, తెలంగాణా, సీమన్ధ్ర, ఆంధ్ర, తెలంగాణా బిల్, పార్లమెంట్, యు.ఫై.ఏ, బి.జె.పీ

  

No comments:

Post a Comment