ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిద బిల్లు) కు లోకసభ మంగళవారం యంత్రం ఆమోదం తెలిపింది. క్లాజులవారిగా వోటింగ్ జరిపి బిల్లు ను ఆమోదించడం జరిగింది.
ప్రధాన ప్రతిపక్షం అయిన బి.జె.పి. మద్దతు తో తెలంగాణ ముసాయిద బిల్లు ను అధికార యు.ఫై.ఏ. గట్టెక్కించింది. సభలో శుశీల్కుమర్ షిండే, సుష్మా స్వరాజ్ మరియు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడారు.
దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధన కల నెరవేరింది. తెలంగాణా రాష్ట్ర సాధన లో ముఖ్యంగా కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ గారు మరియు శ్రీ కె.సి.అర్ గారి పాత్ర చరిత్రలో శాశ్వతంగా సువర్ణాక్షరాలతో నిలిచిపోధగ్గది. తెలంగాణా అమరవీరులు, జె.ఎ.సి. నాయకులు, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, చిన్న, పెద్ద, అందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
ప్రాంతాలుగా విడి పోయిన తెలుగుజాతి ప్రజలుగా కలిసుండాలని రెండు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించలని 2dayupdates.blogspot.com అభిలాశిస్తోంది.
తెలంగాణా లో మిన్నంటిన తెలంగాణా రాష్ట్ర సంబరాలు:
No comments:
Post a Comment