పాత తరం తెలుగు సినిమా డైరెక్టర్ లు దాసరి నారాయణ రావు, K. విశ్వనాధ్, జంద్యాల, బాపు, సింగీతం శ్రీనివాస రావు, K. రాఘవేంద్ర రావు, A. కోదండ రామి రెడ్డి, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య లాంటి ఎందరో దర్శకులు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటేల తెలుగు వాడు గర్వించేలా సినిమాలు తీస్తే.. ఇప్పటి తరం యువ దర్శకులు మాత్రం తెలుగు సినిమా ప్రతిష్టను దిగాజార్చేల సినిమాలు తీస్తూ తెలుగు సినిమా పరువు బజారుకు ఈడుస్తున్నారు.
ముఖ్యంగా శ్రీను వైట్ల, వి.వి. వినాయక్ లాంటి దర్శకులు కొత్తగా ఇండస్ట్రీ లోకి వొచ్చే యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచేలా సినిమాలు తీసేది పోయి, సామాన్యులు సైతం ఎవడ్రా ఈసినిమా తీసిన డైరెక్టర్ అని తిట్టుకునేలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వారి సినిమాలనే వారు కాపీ కొట్టడమే కాకుండా ఆల్రెడీ వేరే దర్శకులు తీసిన సినిమాలను మక్కికి మక్కి కాపీ కొడుతూ కామెడీ మిక్స్ చేసి హిట్ కొడుతూ పబ్బం గడుపుకొన్తున్నరు. ఇలా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కాపీ కొట్టి తీసిన వీరి సినిమాలు ఆడటంలేవా అంటే ఆడుతూనే ఉన్నాయి. ఎందుకంటే కథ ఏ సినిమా కాపీ ఐనా కామెడీ బాగా ఉండేటట్లు వీరు జాగ్రత పడుతూ హిట్ కొట్టి తమ పబ్బం గడుపుకొంటున్నారు (నేరస్తుడు చట్టం లోని లొసుగులను ఉపయోగించి బైట పడ్డట్టు). ఇలా వొచ్చినవే వీరి లక్ష్మి (సింహాద్రి, అన్నయ్య మరియు ఇతర సినిమాలను కాపీ చేసి), నాయక్ (సింహాద్రి, ఇతర సినిమాలను కాపీ కొట్టి తీసిన సినిమా) శ్రీను వైట్ల తో పోలిస్తే వి.వి. వినాయక్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది ఎందుకంటే ఒక నాలుగైదు సినిమాలను మిక్స్ చేసి కామెడీని మేళవించి ఇతరులను నొప్పించకుండా వేరే వాళ్ళపై సెటైర్ వేయకుండా నీట్ గ తీస్తాడు.
కాని శ్రీను వైట్ల మాత్రం అలా కాదు, ఇప్పటివరకు తాను తీసిన సినిమాలనే అటు మార్చి ఇటు మార్చి, బాగా కామెడీ ని మేళవించి వేరే దర్శకుల పై హీరోలపై, ఇతర ప్రముఖుల పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ ఇతనేదో నికార్సైన దర్శకుని మల్లె అయన సినిమాలలో చూపిస్తారు. శ్రీను వైట్ల తీసిన సినిమాలను పరిశీలిస్తే 'డీ' కి ముందు ఆతర్వాత అన్నట్లుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను 'డీ' కి ముందు తీసిన సినిమాలు కాపీ లాగా కాకుండా కథ మరియు కథనం దేనికదే డిఫరెంట్ గా ఉన్నయి. కాని 'డీ' తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ దాని జిరాక్స్ కాపీ లాగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలనే ఆయన కాపీ కొట్టాడనుకొంటే మహేష్ బాబు తో ఇటివలే తీసిన ఆగడు మూవీ చూసాక శ్రీను వైట్ల పైన సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి అసహ్యం పుడుతుంది అదే సమయంలో మహేష్ బాబు ఎలా ఈ సినిమాను ఒప్పుకున్నాడో అని ఆశ్చర్యం వేస్తుంది. ఆగదు ట్రైలర్ విడుదల అయినప్పుడే ఇది గబ్బర్ సింగ్ కు కాపీ లా ఉందే అనుకున్నారు అందరూ.., అనుకున్నట్టుగానే ఆగడు మొదటి సగ భాగం అచ్చుగుద్దినట్టు గబ్బర్ సింగ్ లా ఉండటం తో మహేష్ అభిమానులు తల ఎక్కడ పెట్టుకొవాలో తెలియక శ్రీను వైట్ల ను బూతులు తిట్టున్నరు. మిగతా సగ భాగం అచ్చుగుద్దినట్టు ఆయన తీసిన దూకుడు లానే ఉండటం తో మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు సగటు తెలుగు ప్రేక్షకుడు సైతం "వీడెవడండి బాబు తీసిన సినిమాలనే చూపించి దానికో కొత్త టైటిల్ తగిలించి "a film by srinu vaitla" అని వేసుకున్నాడు ఈమాత్రం సినిమా మనం తీయలేమా ఏంటి" అని శ్రీను ను బండ బూతులు తిట్టుకున్నరు. ఇండస్ట్రీ లో నిర్వివాదుడైన హీరో మహేష్ చేత ఇతర హీరోల పై వ్యంగ్య డైలాగ్ లు చెప్పించి అతనిని వివాదాలలో ఇరికించాడు. కామన్ ఆడియన్ కూడా శ్రీను వైట్ల సినిమా అంటే ముందే స్టొరీ చెప్పేలా చండాలంగా దిగజారిపొయాడు. ఈ మహానుబావుడు ఎంతో గొప్ప దర్శకుడైనట్టు మిగతా దర్శకులను, హీరోలను ఈయన సినిమాలలో నీచంగా చిత్రిస్తూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తాడు (దుబాయ్ సీను లో సాల్మన్ రాజు, బాద్ష లో revange నాగేశ్వర రావు, కింగ్ లో బ్రహ్మానందం తో మ్యూజిక్ డైరెక్టర్ వేషం, ఇంకా చాలానే ఉన్నయి. చెల్లని రూపాయికి గీతలేక్కువ అన్నట్టు). ఇలాంటి దిగజారుడు తనం ఉన్న దర్శకుల మూలంగా తెలుగు సినిమా అప్రతిష్ట పాలు అవుతోంది. పొరుగు తమిళ దర్శకులు కొత్త కథలతో సరికొత్త కథనాలతో అపరిచితుడు, రోబో, గజినీ, రంగం, ఐ లాంటి చిత్రాలతో ప్రపంచ సినిమాలలో తమిళ సినిమా ప్రతిష్ట పెంచుకొంటూ ప్రపంచాన్ని తమిళ సినిమా వైపు చూసేలా చేస్తూ తమిళ చిత్ర ప్రతిష్ట ను పెంచుతుంటే, మన దర్శకులు తీసిన సినిమాలనే కాపీ కొడుతూ పక్కవాడి సినిమాను కాపీ కొడుతూ నీచమైన సమాజానికి పనికిరాని డైలాగ్ లను ఉచ్చరిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని దిగజరుస్తూ ఉన్నారు.
ఇప్పటికైనా మన దర్శకులు పాత తరం దర్శకులను ఆదర్శంగా తీసుకొని ఇండియన్ సినిమాలో మన తెలుగు సినిమా పరువు దిగజార్చకుండా చూస్తారని ఆశిద్దాం. వారికి సొంతంగా అలోచించి కొత్త కథ మరియు కథనాలతో సినిమాలు తీసే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రర్దిద్దాం.
Search tags: aagadu movie review, aagadu talk, movies, online movies, telugu movies, v.v. vinayak, telugu movie news.