పవన్ కళ్యాణ్ అభిమానుల పిచ్చి తారా స్థాయికి వెళ్ళింది. జనసేన పార్టీ చెందిన ఫేస్బుక్ ఎకౌంటు లో 50 రూపాయల ఇండియన్ కరెన్సీ నోట్ పై మహాత్మా గాంధీ ఫోటో ఉండాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ను పెట్టి "ఆయన ఒక వంద సంవత్సరాల క్రితం జన్మించి ఉంటె మన పచ్చ నోటు నిజంగా ఇలా ఉన్దెధి" అని పోస్ట్ చేసారు. ఈ విషయమై నగరం లోని ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ పై ఫిర్యాదు నమోదయ్యింది. మహాత్మా గాంధీ ని కించపరిచారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కొరరు.
పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు, ఒక రిజిస్ట్రేషన్ కూడా కానీ పార్టీ అధ్యక్షుడు అంతే కానీ కనీసం సర్పంచ్, వార్డ్ మెంబెర్ కూడా కాదు, ప్రజలకు సేవ చేసిన ఎందరో మహానుభావులు, పుణ్య పురుషులకు కూడా దక్కని అరుదైన గౌరవం సమాజానికి ఎలాంటి సేవలు అందించని ఒక సినిమా ఆక్టర్ కు ఆపాదించడం, ప్రపంచం మొత్తం మహాత్ముడు, జాతిపిత గా సంబోదించే గాంధీ ఫోటో ఉండాల్సిన చోట ఆ ఫోటో ను తీసేసి పవన్ కళ్యాణ్ ఫోటో ను పెట్టటమే కాకుండా "ఆయన ఒక వంద సంవత్సరాల క్రితం జన్మించి ఉంటె మన పచ్చ నోటు నిజంగా ఇలా ఉన్దెధి" అని రాయటం అయన అభిమానుల పిచ్చి కి పరాకాష్ట గా నిలుస్తోంది. ఇలాంటి వెధవ పని చేసినవారిని వూరికే వొదిలేస్తే రేపు మరో సినిమా ఆక్టర్ అభిమాని మరో గొట్టం గాడి ఫ్యాన్ కూడా ఇలాంటి పోస్ట్ లు రాసి దేశం పరువు బజారు కు ఈడుస్తాడు. కాబట్టి నిందితునిపై సరిఐన చర్య తీసుకోవాలి.
ఇంత జరుగుతున్నా కూడా నటుడు పవన్ కళ్యాణ్ ఈ వివాదం పై స్పందించక పోవటం అయన బాద్యత రాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ అతను కూడా గాంధీ కి సరిసాటి అని అనుకుంటున్నాడెమో అని అయన మౌనం ను ఇలా అర్థం చేసుకుంటున్నారు కొందరు విశ్లేషకులు.
ఏది ఏమైనా ఇప్పుడున్న జనరేషన్ కు గాంధీ, సుబాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, మొదలగు సంచలన భారత యోధుల గురించి అవగాహనా కల్పించాల్సిన అవసరముందని అర్థముతోంది. లేకుంటే ఇలాగె భారతావని సిగ్గు పడేలా తల దించుకునేల ఫేస్బుక్ లో పోస్టులు వేస్తారు, వీలైతే గుడులు కూడా కట్టిస్తారు.